సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (14:14 IST)

బట్టతలపై ముద్దు.. ధోనీ భార్యపై ఫైర్ అవుతున్న నెటిజన్లు..(video)

చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భార్య సాక్షి సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె షేర్ చేసినటువంటి ఫోటో, అలాగే పోస్ట్ చేసిన ట్వీట్‌పై ఇప్పుడు నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్ చేస్తూ.. బంజరు భూమి.. పచ్చదనం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. 
 
గడ్డి ఈ వైపు ఇంకా పచ్చగా లేదు .. అంటూ మోనూ కుమార్ అనే క్రికెటర్ తలపై సాక్షి సింగ్ ముద్దుపెట్టింది. అతని బట్టతలపై సెటైర్ వేస్తూ బీ-పాజిటివ్ ఆల్‌వేస్ హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె ఈ ట్వీట్ చేశారు. 
 
ప్రస్తుతం మోనూ కుమార్ చెన్నై టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. మీరు ఇలాంటి పోస్ట్ పెట్టడం తమను ఎంతగానే బాధించిందని కొందరు నెటిజన్లు పేర్కొనగా.. పాజిటివ్‌గా ఆలోచించండి అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వరుస ట్వీట్లతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.