శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (15:33 IST)

టిక్ టాక్‌లో 'ఈ రోజే తెలిసిందం'టున్న శ్రీరెడ్డి... అవి కూడా విప్పేయరాదూ అంటూ...

క్యాస్టింగ్ కౌచ్ పుణ్యమాని బోలెడంత పాపులారిటీ, మీడియా అటెన్షన్ సంపాదించుకున్న శ్రీరెడ్డి వ్యవహారం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇన్నిరోజులు ఫేస్‌బుక్‌లో మాత్రమే ఫోటోలు, వీడియోలతో అరాచకం సృష్టిస్తున్న శ్రీరెడ్డి కొత్తగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ను స్వంతంగా ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి తీరిక లేకుండా వివాదాస్పద కామెంట్స్ చేయడంతో పాటుగా అడపాదడపా ఆట, పాటలతో హాట్ టాపిక్‌గా మారింది. 
 
సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్‌ను రోజురోజుకూ పెంచుతూ, తన ఆటపాటల వీడియోలు, హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ రెచ్చిపోతోంది శ్రీరెడ్డి. తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన రవితేజ ‘ఇడియట్’ సినిమాలోని ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ అనే మెలోడియస్ పాటకు ఇలా కూడా డ్యాన్స్ చేయొచ్చా అన్న రేంజ్‌లో దూసుకుపోయింది ఈ అమ్మడు. 
 
జీన్స్ అండ్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి హాట్ హాట్ అందాలను చూపిస్తూ రొమాంటిక్‌గా ఈ పాటకు చిందులేసింది. ఇప్పటికే ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న శ్రీరెడ్డి ఈ ఆట పాటల వీడియో పెట్టగానే నెటిజన్ల స్పందన ఓ రేంజ్‌లో ఉంది. ‘అది కూడా విప్పేయాల్సిందని కొంతమంది ఘాటుగా స్పందిస్తుంటే, నో బ్రదర్ చూసి ఆనందించు అంటూ మరికొంత మంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.