శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 9 మే 2019 (11:48 IST)

సూర్య సినిమాని ఆ డైరెక్ట‌ర్ వ‌దిలేసాడా...? అస‌లు ఏం జ‌రిగింది..?

తమిళ హీరో సూర్య న‌టించిన తాజా చిత్రం "ఎన్.జి.కె". ఈ చిత్రానికి సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల చెన్నైలో ఆడియో ఫంక్ష‌న్ జరిగింది. దర్శకుడు సెల్వ రాఘ‌వ‌న్‌తో ఎప్ప‌టి నుంచో వ‌ర్క్ చేయాల‌నుకుంటే ఇన్నాళ్ల‌కు కుదిరింది. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం వ‌ల‌న ఎన్నో కొత్త విష‌యాలు తెలుసుకున్నట్టు సూర్య చెప్పారు.

అంతా బాగానే ఉంద‌నుకుంటే... సూర్య సెల్వ‌రాఘ‌న్ మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌ని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అందుక‌నే సెల్వ షూటింగ్ లాస్ట్ డేస్‌లో సెట్‌కి రాలేద‌ట‌. ప్యాచ్ వ‌ర్క్‌ను అసి‌స్టెంట్ డైరెక్ట‌ర్స్ పూర్తిచేశారు. దీంతో సూర్య‌కు బాగా కోపం వ‌చ్చింద‌ట‌. 
 
ఇప్పుడు సెల్వ రాఘ‌వ‌న్ లేకుండానే సినిమా బ‌య‌ట‌కు వ‌స్తోంద‌ని తెలుస్తోంది. సెల్వ ప్రమోష‌న్ల‌కైనా వ‌స్తాడా..? లేదంటే ఆ విష‌యంలోనూ హ్యాండిస్తాడా? అనేది అనుమానంగా మారింది. సినిమాను పూర్తి చేయ‌డానికి హీరోల్నీ, నిర్మాత‌ల్నీ బాగా ఇబ్బంది పెడ‌తాడనే విషయం మరోమారు నిరూపితమైంది. సూర్య‌.. సెల్వ గురించి ఈసారి క‌రెక్టుగా మాట్లాడ‌తాడేమో..!