శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (12:36 IST)

కేంద్ర బడ్జెట్ 2024 : అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు (Video)

nirmala sitharaman
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడివుందన్నారు. అలాగే, నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. 
 
అలాగే, నిరుద్యోగుల కోసం మూడు పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు ఈపీఎఫ్‌లో నమోదు ఆధారంగా వీటి అమలు, 'సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు ఉంటారని, 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. 
 
అలాగే, ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్ఎంఈపై దృష్టి. వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు. వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం వంటి అంశాలను ప్రధానంగా ఆమె ప్రస్తావించారు. ప్రజల మద్దతుతో నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చామని, దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉందని, అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచినట్టు, మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తామని తెలిపారు.