ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (12:30 IST)

బడ్జెట్ 2024 : కోటి మందికి ఉద్యోగ కల్పన - గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు

budget
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా, కోటి మందికి ఉద్యోగాను కల్పిస్తామని తన ప్రసంగంలో పేర్కొన్నారు. 500 పెద్ద కంపెనీల్లో ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. వంద నగరాల్లో ఫ్లగ్ అండ్ ప్లే తరహారాలో పారిశ్రామిక పార్కులు నిర్మిస్తామని తెలిపారు. 12 విస్తృత పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేపడుతామని వెల్లడించారు. 
 
గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మౌలిక సదుపాయాల కోసం రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు. ఈ కేటాయింపు జీడీపీలో 3.4శాతంగా ఉందని గుర్తుచేశారు. వరద నివారణ కోసం బీహార్ రాష్ట్రానికి రూ.11 వేల కోట్లు కేటాయించారు. వరద నివారణకు అస్సాం, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక నిధులను కేటాయించినట్టు పేర్కొన్నారు. స్టాంప్ డ్యూటీని పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. మహిళల ఆస్తులపై రిజిస్ట్రేషన్‌పై స్టాంపు డ్యూటీని తగ్గించినట్టు పేర్కొన్నారు. కాశీ తరహాలో గయ అభివృద్ధి చేస్తామని, బీహార్ రాజ్‌గిరి జైన ఆలయాభివృద్ధికి సమగ్ర ప్రణాళిను, టూరిజం కేంద్రం నలందా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా కేన్సర్ రోగులకు ఊరట కల్పించారు. కేన్సర్ నివారణ కోసం వాడే మందులపై సుంకాన్ని ఎత్తివేశారు. మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీని తగ్గించారు. బంగారం వెండిపై కూడా కస్టమ్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు తెలిపారు ప్లాటినం ఆభరణాలపై 6.4 శాతానికి కస్టమ్స్ డ్యూటీని కుదించినట్టు పేర్కొన్నారు.