సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (20:08 IST)

బావిలోకి దూసుకెళ్లిన కారు.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో కారు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారులో అదుపుతప్పి ఎక్కువగా నీరు ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న కారు.. ముందు వెళ్తున్న మరో కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో బావిలోకి దూసుకెళ్లింది.
 
ప్రమాదానికి గురైన కారులో ఒక్కరే వున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  మృతుడు కోడుమూరుకు చెందిన రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు.