1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (12:47 IST)

ఆస్కార్ రేస్ నుంచి జై భీమ్ ఔట్: తీవ్ర నిరాశ చెందిన సూర్య అభిమానులు

సూర్య అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దానికి కారణం సూర్య కోర్ట్‌ డ్రామా “జై భీమ్” చిత్రం ఆస్కార్ 2022 నుంచి ఔట్ అయిపోయింది. దీనితో ఆస్కార్ అవార్డు వస్తుందని ఎంతో ఆశగా చూసిన సూర్య అభిమానులు నిరాశకు గురయ్యారు. కాగా 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 276 చిత్రాలలో ఒకే ఒక్క తమిళ మూవీ “జై భీమ్”.

 
ఇకపోతే తాజాగా 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మరో మూడు అవార్డులను జైభీమ్ చిత్రం గెలుచుకుంది. వాటిలో ఒకటి ఉత్తమ చిత్రంగా జై భీమ్, ఉత్తమ హీరోగా సూర్య, ఉత్తమ హీరోయిన్‌గా లిజోమోల్ జోస్ ఎంపికయ్యారు.