శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (18:21 IST)

'జై భీమ్‌'కు మరో మూడు అవార్డుల పంట

హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రం అవార్డులను కొల్లగొడుతుంది. ఇప్పటికే 94వ ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతున్న 276 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. అలాగే, ఆస్కార్ అకాడెమీకి చెందిన అధికారిక యూట్యూబ్‌లోనూ ఈ చిత్రానికి సంబంధించి 13 నిమిషాల వీడియో ఒకటి అప్‌లోడ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మరో మూడు అవార్డులను జైభీమ్ చిత్రం గెలుచుకుంది. వాటిలో ఒకటి ఉత్తమ చిత్రంగా జై భీమ్, ఉత్తమ హీరోగా సూర్య, ఉత్తమ హీరోయిన్‌గా లిజోమోల్ జోస్ ఎంపికయ్యారు. దీంతో మరో మూడు అవార్డులను ఈ చిత్రం కైవసం చేసుకుంది.