గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (19:32 IST)

RRR నుంచి బిగ్ బ్రేకింగ్‌: పక్కాగా రిలీజ్ చేస్తాం.. ఎప్పుడంటే?

RRR నుంచి బిగ్ బ్రేకింగ్‌ న్యూస్ వచ్చేసింది. రాజమౌళి, రామ్ చరణ్, తారక్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలున్నాయి. భారత ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. 
 
కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేశారు. ఒకటి కాదు ఏకంగా రెండు రిలీజ్ డేట్లు ప్రకటించి ఔరా అనిపించారు.
 
"కరోనా కలకలం తొలగిపోయి అన్ని పరిస్థితులు అనుకూలించి పూర్తి ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభమైతే మార్చ్‌ 18న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అలా జరగకుంటే ఎలాంటి పరిస్థితులున్నా సరే ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్‌ని రిలీజ్ చేస్తాం" అని మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.