Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అమరావతి భూములపై సీబీ'ఐ'

Written By ఎం
Updated: మంగళవారం, 24 మార్చి 2020 (05:20 IST)
రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఆది నుంచి ఆరోపణలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. వాటిని తేల్చేందుకు సీబీఐ తో దర్యాప్తుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో భూకొనుగోళ్లలో భారీగా అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయంటూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పేరుతో అక్రమాలకు పాల్పడినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.

దీనిపై మంత్రివర్గ ఉప సంఘం అన్ని రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించి గతేడాది డిసెంబర్‌ 27న నివేదిక ఇచ్చింది. ఓత్‌ ఆఫ్‌ సీక్రెసీ (అధికారిక రహస్యాలు వెల్లడించననే ప్రమాణాన్ని)ని ఉల్లంఘించినట్టు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది.

రాజధానిపై తమ వాళ్లకు ముందస్తు లీకులు ఇవ్వడంతో 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌లోపు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,069.94 ఎకరాల భూ కుంభకోణం జరిగినట్టు నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే.

అన్నీ చూడండి

Ranabali Lunch : రణబాలి లంచ్ మీట్ - త్వరలో ట్రైలర్ తో ముందుకు వస్తున్నాం

Nagarjuna: నాగార్జున, మణిరత్నం... గీతాంజలి 4Kలో గ్రాండ్ రీ-రిలీజ్‌ కు సిద్ధం

అనిల్ రావిపూడి ఆవిష్కరించిన కుకూన్స్ సినిమా పోస్టర్

ఒకే సూర్యుడు.. ఒకే చంద్రుడు... ఒకే సూపర్ స్టార్ : సౌందర్య రజనీకాంత్

అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ICONZAకు శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్

తర్వాతి కథనం
Show comments