అమరావతి రైతుల వెంటే నేను : పవన్

Pawan Kalyan
ఎం| Last Updated: శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:39 IST)
రాజధాని రైతుల కోసం బీజేపీతో కలిసి ర్యాలీ నిర్వహిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజధాని విషయంలో బీజేపీ పెద్దలతో తాను మాట్లాడానని, బీజేపీ కూడా అమరావతికి కట్టుబడి ఉందని అన్నారు.

శనివారం రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్ ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని రైతుల కోసం బీజేపీతో కలిసి ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో కేంద్రం కూడా కొన్ని విషయాల్లో ఏమీ చేయలేని పరిస్థితులుంటాయని అన్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా...తాను రైతుల వెంటే ఉంటానని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు.
దీనిపై మరింత చదవండి :