బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (16:47 IST)

స్థానిక ఎన్నికల్లో జనసేనతో ఎలా ముందుకు పోవాలి? ఆంధ్రప్రదేశ్ భాజపా కోర్ కమిటీ

BJP core commitee meet
కోర్ కమిటీలో ముఖ్యంగా మార్చిలో జరుగనున్న నున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ వ్యవహరించాల్సిన విషయాల పై సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీతో పొత్తులో ఉన్న జనసేన సంయుక్తంగా ముందుకు ఏవిధంగా పోవాలి అనే విషయాన్ని చర్చించారు. 
 
అలానే దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుపై మొదలు వ్యతిరేకత వ్యక్తం చేసిన పార్టీలు సైతం ఇప్పుడు సమర్ధించడం మంచి పరిణామామని ఒకటీ రెండు పార్టీలు కావాలనే రాద్ధాంతం చేసినా ప్రజలు, కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టారని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ బిల్లుపై పలు అవగాహనా సదస్సులు విజయవంతమయ్యాయని తెలిపారు.
 
పార్టీలో సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పెండింగులో ఉన్న జిల్లా అధ్యక్షులను త్వరితగతిన వారంలో ప్రకటించాలని తీర్మానించారు. అమరావతి రాజధాని విషయంలో కేంద్రంలో పెద్దలను సంప్రదించి స్పష్టమైన కార్యాచరణలో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇప్పటివరకు పూర్తి అయిన క్రియాశీలక సభ్యత్వాల నమోదు ఎంతవరకు పూర్తి అయినవి ఇంకా పూర్తి కావలసినవి పూర్తి సమగ్ర నివేదికను కేంద్ర పార్టీ కార్యాలయానికి సమర్పించాలని నిర్ణయించారు.