గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (05:45 IST)

నేడు కర్నూలుకు పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు కర్నూలులో పర్యటించనున్నారు. విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రేపు కర్నూలులో నిర్వహించే ర్యాలీ, బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు.

అలాగే మధ్యాహ్నం 3 గంటలకు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారని, ఈ ర్యాలీలో జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు పాల్గొననున్నట్లు జనసేన పార్టీ తెలిపింది.

అనంతరం కోట్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ పేర్కొంది. అలాగే ఎల్లుండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూలు, ఎమ్మిగనూరులో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతారని జనసేన పార్టీ తెలిపింది.