1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 6 నవంబరు 2021 (11:09 IST)

ఈనెల 14న తిరుప‌తిలో అమిత్ షా సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం

కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధం అవుతోంది. ఈనెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి 6కిపైగా అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని సీఎం  జగన్ ఆదేశించారు.


రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిలు, రెవెన్యూ లోటు, రేషన్‌ బియ్యంపై హేతుబద్ధతలేని కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్‌లైస్‌ బకాయిలు, పోలవరం రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు అన్నింటిపై తాజా నివేదిక‌లు స‌మ‌ర్పించాల‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. 

 
ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని సీఎం జ‌గ‌న్ ఉన్న‌తాధికారుల‌కు సూచించారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిలపై కూడా ప్రస్తావించనున్నారు.