ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (11:23 IST)

బాబు ఊసరవెల్లి.. పవన్, బీజేపీని మోసం చేశాడు.. కేశినేని నాని

kesineni nani
చంద్రబాబు నాయుడు, లోకేష్ పేర్లు వింటేనే విజయవాడ ఎంపీ కేశినేని నాని రెచ్చిపోతున్నారు. టీడీపీలో తనకు అవమానం జరిగిందని కేశినేని నాని ఆరోపించారు. కేశినేనికి సీఎం జగన్ విజయవాడ పార్లమెంటు సీటు ఇవ్వకపోవడంతో ఆయన వైకాపాలో చేరారు. 
 
తాజాగా చంద్రబాబు నాయుడుపై కేశినేని నాని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఎన్నో పాటలు పాడారని ఎద్దేవా చేశారు. బాబుకి ఒక్క ముక్క హిందీ కూడా రాదు. ఒకప్పుడు మోడీని టెర్రరిస్టు అని విమర్శించిన చంద్రబాబే ఇప్పుడు గొప్పలు చెప్పుకుని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని విమర్శించారు. 
 
చంద్రబాబు రంగులు మార్చడంలో ఊసరవెల్లిలా తయారయ్యారని ఫైర్ అయ్యారు. స్కాం నుంచి బయటపడేందుకు మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుని కూటమి కట్టారని విమర్శించారు. పవన్ కళ్యాణ్, బీజేపీ ఇద్దరినీ చంద్రబాబు మోసం చేశారని కేశినేని ఆరోపించారు.