శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (19:21 IST)

శాడిస్ట్, సైకో, ఐరన్ లెగ్ కాంబినేషన్ ఈ జగన్ రెడ్డి... ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్

chandrababu
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ సారథ్యంలో రాష్ట్రంలో దిక్కుమాలిన పాలన సాగుతోందన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ దిక్కుమాలిన పాలన పసి పిల్లలకు కూడా బాగా అర్థమైందన్నారు. ధరల పెంపులో ఉన్న జగన్ రెడ్డివి చావు తెలివితేటలన్నారు. ఆస్తుల కబ్జాలకు సీఎం, ఎమ్మెల్యేలు తీవ్రవాదుల్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
"జగన్ నుంచి విముక్తి పొందండి... ఆంధ్రాను రక్షించండి" అని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను డిమాండ్  చేశాకే పోలీసులకు టీఏ, డీఏ నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. సారా వ్యాపారం చేసిన బొత్స సత్యనారాయణకు విద్యాశాఖను కట్టబెట్టారని విమర్శించారు. అమ్మ ఒడికాదు.. అర ఒడి కూడా దక్కలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.