బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 నవంబరు 2017 (12:25 IST)

జగన్మోహన్ రెడ్డితో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ గోవిందా: చంద్రబాబు ఫైర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ అవినీతి పరుడు అని.. అతడి అవినీతి గురించి ఇప

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ అవినీతి పరుడు అని.. అతడి అవినీతి గురించి ఇప్పటికీ బయట దేశాల వారు తనతో ఆరా తీస్తున్నారని బాబు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి వల్ల ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది జడుసుకుంటున్నారని బాబు తెలిపారు. జగన్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని.. నష్టమేనని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. తాము ఒక పద్ధతి ప్రకారం వెళ్లామని, పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా పోయిందన్నారు. ప్రస్తుతం మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాబు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసేది అల్లరేనని చెప్పారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నానన్నారు. పాదయాత్ర చేస్తే సీఎం అవుతాననుకోవడం భ్రమ మాత్రమేనని బాబు తెలిపారు. తన పాదయాత్ర నాటి పరిస్థితులు వేరని, అప్పుడు వైసీపీ నాయకురాలు షర్మిల కూడా పాదయాత్ర చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
 
ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డం పడుతోందని, వైఎస్ హయాంలో ప్రాజెక్టులను తాను అడ్డుకోలేదని, అవినీతిని మాత్రమే ప్రశ్నించానని చంద్రబాబు తెలిపారు. జగన్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కష్టమవుతుందన్నారు. 
 
కాగా.. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్‌తో వారిపై చర్యలు తీసుకోనుందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ సభ్యులు, మిత్రపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే సభలో మిగిలారు. 
 
ఈ నేపథ్యంలో సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోశారు. ప్రతిపక్షానిది బాధ్యతా రాహిత్యమన్నారు. అయితే ఫిరాయించిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ రాలేదు.