సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 మే 2023 (09:36 IST)

17 నుంచి టీడీపీ చీఫ్ చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన

chandrababu
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, 17న పెందుర్తి, 18న ఎస్.కోట, 19న అనకాపల్లిలలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మొత్తం మూడు రోజుల పాటు "ఇదేం ఖర్మ రాష్ట్రానికి" అనే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 
 
ఇందుకోసం ఆయన ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రబాబు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4.45 గంటలకు పెందుర్తి సమీపంలోని మహిళా ప్రాంగణం వద్దకు చేరుకుని పంచ గ్రామాల సమస్యపై వినతిపత్రాలు స్వీకరిస్తారు. ఐదు గంటలకు మహిళా ప్రాంగణం జంక్షన్ నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది.
 
పెందుర్తి జంక్షన్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం సరిపల్లి వద్ద బస్సులో బస చేస్తారు. 18వ తేదీ ఉదయం బస్సు వద్ద టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం స్థానిక నేతలతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12 గంటలకు మత్స్యకారులతో సమావేశమవుతారు. 330 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి ఎస్.కోట వెళతారు. అక్కడ రోడ్, అనంతరం బహిరంగ సభల్లో పాల్గొన్న అనంతరం ఆరోజు రాత్రి స్థానిక రిసార్టులో బస చేస్తారు.
 
19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రిసార్ట్స్ నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు అనకాపల్లి సమీపంలోని శంకరం జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడ నల్లబెల్లం రైతుల నుంచి వినతిపత్రం స్వీకరిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహిస్తారు. నాలుగురోడ్ల కూడలి మీదుగా 6.30 గంటలకు నెహ్రూ చౌక్‌కు చేరుకుని ఆ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించి రాత్రి 8 గంటలకు బయలుదేరి 9 గంటలకు ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయవాడ వెళతారు.