సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (11:36 IST)

బసవరాజ్ బొమ్మైకి హాయ్ చెప్పిన పాము.. నిజమా?

Snake
కర్ణాటకలోని షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యాలయానికి అనుకోని అతిథి వచ్చింది. అదేదో సెలెబ్రిటీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అది పాము. శనివారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి హాయ్ చెప్పేందుకు పాము వచ్చింది. 
 
బీజేపీ కార్యాలయం ఆవరణలో పాము కనిపించడంతో అక్కడున్న జనంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అయితే, పరిస్థితిని అదుపులోకి తెచ్చిన సిబ్బంది పామును పట్టుకున్నారు. 
 
సంఘటన తర్వాత, భవనం కాంపౌండ్‌కు భద్రత కల్పించారు. సిబ్బంది లేదా సందర్శకుల భద్రతకు ఎటువంటి ప్రమాదాలు లేవని నిర్ధారించడానికి ప్రాంగణాన్ని తనిఖీ చేశారు.