Karnataka Election Results 2023 LIVE: పోస్టల్ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో కాంగ్రెస్
Karnataka Election results
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఎన్నికలపై బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 224 స్థానాలకు గాను ఈ నెల 10 ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల కౌంటింగ్ ఫలితాల శనివారం విడుదల అవుతున్నాయి.
ఇందులో భాగంగా పోస్టల్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం 50 దాటింది. 8.40 గంటల ప్రాంతంలో భాజాపా 40, కాంగ్రెస్ 54, జేడీఎస్ 13, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచారు. 8.30 గంటల వరకు భాజపా 39, కాంగ్రెస్ 42, జేడీఎస్ 11, ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో నిలిచారు.
అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం మధ్యాహ్నం నాటికి స్పష్టత రావచ్చు. 224 నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో 73.19 శాతం రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది.