గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 మే 2023 (15:00 IST)

సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్

bandi sanjay
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు.
 
ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది నేతలు ఇప్పటికే ఇక్కడకు చేరుకున్నారు. వారితో పాటు బీజేపీ యువ మోర్చా నేతలకు కూడా పాల్గొన్నారు. 
 
ఈ ర్యాలీ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్స్ వరకూ ఈ ర్యాలీ సాగనుంది. అధిక సంఖ్యలో బీజేపీ నేతలు పాల్గొనడంతో పోలీసులు భారీ స్థాయిలో భద్రతను కల్పించారు. ఈ ర్యాలీ కోసం రాష్ట్రం నలమూలల నుంచి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి పాల్గొన్నారు.