సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (11:04 IST)

శేఖర్ రెడ్డి.. బెయిల్‌పై అలా బయటకొచ్చాడో లేదో.. ఇలా అరెస్టు చేసిన ఈడీ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్ జె.శేఖర్ రెడ్డిని చుట్టుముట్టిన కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆయన నోట్ల మార్పిడి కేసులో అరెస్టు అయ్యా

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్ జె.శేఖర్ రెడ్డిని చుట్టుముట్టిన కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆయన నోట్ల మార్పిడి కేసులో అరెస్టు అయ్యారు. గత నాలుగు నెలలుగా జైల్లో ఉంటున్న ఆయన ఇపుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో శేఖర్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చాడు. 
 
అలా బయటకు వచ్చాడో లేదో... ఆయనను ఈడీ అధికారులు మళ్లీ అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే అక్రమ నగదు నిల్వలు కలిగివున్నారని పేర్కొంటూ ఆయనను అదుపులోకి తీసుకుంది. శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాసులు ప్రేమ్ కుమార్‌లనూ ఈడీ అరెస్ట్ చేసింది. ఆపై శేఖర్ రెడ్డిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి, ఈ నెల 28 వరకూ కస్టడీకి అనుమతి పొందింది.