శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 మార్చి 2020 (11:10 IST)

తిరుపతిలో కరోనా..? చైనా వ్యక్తికి చికిత్స.. అమెరికాలో తొలి కరోనా మృతి

చైనాను కరోనా వైరస్ వణికించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు కరోనా హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలోని తిరుపతిలో కరోనా అనుమానిత కేసు వెలుగు చూసింది. తైవాన్ నుంచి వచ్చిన చెన్ చున్ హాంగ్ అనే వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దీంతో, తిరుపతిలోని రుయా ఆసుపత్రికి చున్ హాంగ్‌ని తరలించారు.
 
ఐసోలేటెడ్ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, తిరుపతి సమీపంలోని ఓ ఫ్యాక్టరీకి వచ్చిన చున్ హాంగ్ అనారోగ్యం పాలయ్యారు. జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు.
 
మరోవైపు అమెరికాలో కరోనా నమోదైంది. ఇంకా ఓ ప్రాణాన్ని బలిగొంది. వాషింగ్టన్‌లో శనివారం వైరస్ బారినపడి, ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కన్నుమూశాడని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ 66 మందికి వ్యాధి సోకిందని వీరంతా ఏదో ఒక సమయంలో చైనా, దక్షిణ కొరియా తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారేనని తెలిపింది. ఈ వైరస్‌ను విస్తరించకుండా చూసేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకున్నామని పేర్కొంది.