మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (13:39 IST)

రాజీనామా చేస్తా... జగన్‌ చెంతకు వెళ్లను.. కొత్త పార్టీ పెడతా : చింతమనేని ప్రభాకర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపింది. ఈ మంత్రివర్గంలో తమకు చోటు దక్కక పోవడంతో అనేక మంది సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపింది. ఈ మంత్రివర్గంలో తమకు చోటు దక్కక పోవడంతో అనేక మంది సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు పయనించనున్నారు. 
 
ముఖ్యంగా... పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు మంత్రి పదవి దక్కడంపై  దెందూలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గీయులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 
 
దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అయితే జగన్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని, అవసరమైతే కొత్త రాజకీయపార్టీ స్థాపిస్తానని వెల్లడించారు. పార్టీలు మారి కార్యకర్తలను అవమానించలేనన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగాలని తాను అనుకోవడం లేదని, సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తన రాజీనామా లేఖను అందజేస్తానని తెలిపారు.