ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (18:02 IST)

పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారు : పేర్ని నాని

జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పెద్దన్నయ్య చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఆయన్ను తెలుగు సినీ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు కలిశారు. 
 
ఈ సమావేశం ముగిసిన తర్వాత పేర్ని నాని మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ పిచ్చి వాగుడుకి, తమకు సంబంధం లేదని చెప్పడానికే తన వద్దకు నిర్మాతలు వచ్చారన్నారు. పైగా, ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు చిత్రపరిశ్రమకు సంబంధం లేదన్నారు. 
 
అలాగే, పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. కిరాయికి పని చేసేది ఎవరో అందరికీ తెలుసని... జనసేన ఒక కిరాయి పార్టీ అంటూ విమర్శించారు. 
 
రాజకీయ పార్టీని పవన్ కల్యాణ్ ఒక టెంట్ హౌస్‌లా అద్దెకు ఇస్తుంటారని ఎద్దేవా చేశారు. ఆన్‌లైన్ సినిమా టికెట్లను అమ్మే విధానం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. ఆన్‌లైన్ టికెటింగ్‌కు సినీ పరిశ్రమ అనుకూలంగా ఉందని చెప్పారు. సినిమా టికెట్లపై నిర్దిష్టమైన విధానం అవసరమని మంత్రి పేర్ని చెప్పుకొచ్చారు.