సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (09:53 IST)

జనసేనలో 'అన్నయ్య'కు కీలక పదవి ఇవ్వనున్న 'తమ్ముడు'

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఆ వార్త మెగా ఫ్యామిలీకి సంబంధించినదికావడంతో ఇది ట్రెండింగ్ అయింది. ఆ వార్త ఏంటంటే... వచ్చే ఎన్నికలనాటికి మెగాస్టార్ చిరంజీవికి జనసేన పార్టీలో కీలక

హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఆ వార్త మెగా ఫ్యామిలీకి సంబంధించినదికావడంతో ఇది ట్రెండింగ్ అయింది. ఆ వార్త ఏంటంటే... వచ్చే ఎన్నికలనాటికి మెగాస్టార్ చిరంజీవికి జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం. ఇదే విషయం ఫిల్మ్ నగర్‌లో ఓ హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఇటీవల పవన్ కళ్యాణ్ వైజాగ్, వెస్ట్ గోదావరి, కృష్ణా (విజయవాడ), ఒంగోలు జిల్లాల్లో పర్యటించారు. అపుడు ఆయా జిల్లాల జననేస సమన్వయకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాల్లో తన అన్న మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీల గురించి పదేపదే ప్రస్తావించారు. 
 
ముఖ్యంగా, చిరంజీవిది చాలా సున్నితమైన మనస్తత్వమని, ఆయనకు ప్రజాసేవ చేయాలని ఉన్నప్పటికీ.. సొంత మనుషుల వెన్నుపోటు కారణంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, పీఆర్పీ మీడియా సలహాదారునిగా ఉన్న పరకాల ప్రభాకర్‌ను బహిరంగంగానే విమర్శించారు. పైగా, వెన్నుపోటు పొడిచిన వారందరినీ గుర్తుపెట్టుకుని ఉన్నాననీ, వారందరికీ గుణపాఠం చెప్తానంటూ వ్యాఖ్యానించారు. 
 
దీంతో చిరుకి పవన్ జనసేన పార్టీ కీలక బాధ్యతలు అప్పగించవచ్చంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా చిరు కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన కొత్త చిత్రం 'అజ్ఞాతవాసి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రజాసమస్యసలు తెలుసుకునేందుకు రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు.