ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 11 డిశెంబరు 2017 (17:52 IST)

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపిస్తే ఇంటింటికీ కేజీ బంగారం - జగన్

ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలకు హద్దే లేదన్నారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసగించడంలో చంద్రబాబు మించిన వ్యక్తి మరొకరు ఉండరని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గె

ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలకు హద్దే లేదన్నారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసగించడంలో చంద్రబాబు మించిన వ్యక్తి మరొకరు ఉండరని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే ఇంటింటికి కేజీ బంగారం, ఒక మారుతీ కారు ఇస్తానని చంద్రబాబు ప్రచారం చేయడం ఖాయమన్నారాయన. 
 
బాబు మాటలను ప్రజలు నమ్మరు కాబట్టి ఒక నటుడిని వెంట తెచ్చుకుని ఆయన చేత అబద్ధాలు చెప్పించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని అనంతపురం జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు జగన్. రాజకీయాల్లో మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలంటే ఖచ్చితంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలన్నారు వైఎస్.జగన్మోహన్ రెడ్డి.