బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 జనవరి 2020 (14:42 IST)

పొలాల పైనుంచి విద్యుత్ వైర్లు.. కరెంట్ స్తంభాల కోసం గుంతలు.. రైతుల ఫైర్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని చౌటుప్పల్ మండలం రైతులు కలిశారు. చౌటుప్పల్‌లోని దివీస్ కంపెనీ దౌర్జన్యం‌పై మంత్రికి రైతులు ఫిర్యాదు చేశారు. లింగోజిగూడెంలో ఉన్న దివీస్ ఫార్మా కంపెనీకి సంబంధించి 132 కెవి విద్యుత్ లైన్లు చౌటుప్పల్ సబ్ స్టేషన్ నుండి తమ పొలాల మీదుగాగా తీసుకెళ్తున్నారని  రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. 
 
సబ్ స్టేషన్ నుండి రోడ్డు వెంట కరెంటు లైన్ తీసుకు వెళ్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని మా పొలాలు పైనుండి విద్యుత్ వైర్లను తీసుకెళ్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు లైను అడ్డుకున్న రైతులపై దివిస్ ఫార్మా కంపెనీ యాజమాన్యం అక్రమ కేసులు పెట్టిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. 
 
బలవంతంగా వచ్చి తమ పొలాల్లో కరెంటు స్తంభాల కోసం గుంతలు తవ్వుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ లైను రోడ్డు మీదుగా తీసుకువెళ్లేట్టు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రైతులు కోరారు.