ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 17 నవంబరు 2021 (18:28 IST)

గ‌వర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్యంపై సీఎం జ‌గ‌న్, చంద్ర‌బాబు ఆరా

కోవిడ్ తో అనారోగ్యంపాలైన ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రి చంద‌న్ ఆరోగ్యంపై ఏపీ సీఎం, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్‌, సీనియర్‌ వైద్యుడు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డితో నేరుగా ఫోన్‌లో మాట్లాడిన సీఎం జ‌గ‌న్, గవర్నర్‌ ఆరోగ్య పరిస్ధితి, అందిస్తున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

 
గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్‌ నాగేశ్వర రెడ్డి సీఎం జ‌గ‌న్ కు తెలిపారు. ఈ ఉదయం అస్వస్ధతకు గురవడంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో గవర్నర్ ని వైద్య చికిత్స‌కు తరర‌లించారు. 

 
గవర్నర్ ఆరోగ్యంతో తిరిగి రావాల‌ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆకాంక్షించారు. కోవిడ్ తో అనారోగ్యానికి గురై హైదరాబాద్ ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిశ్వభూషణ్ హరిచందన్ త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోరుకున్నారు. గవర్నర్ కు మెరుగైన ఆరోగ్యం అందించాల్సిందిగా ఆయన కోరారు. ఆయురారోగ్యాలతో తిరిగి వచ్చి రాష్ట్రానికి మెరుగైన సేవలందించాలని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.