బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (19:31 IST)

తిరుపతిలో టాటా కేన్సర్ కేర్ సెంటర్ ప్రారంభం

ys jagan
ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో 1.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా ట్రస్ట్ ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ (SVICCAR)ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ ఆస్పత్రిని రూ.180 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. 
 
ఇదే అంశంపై ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్ దత్తాత్రేయ నోరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ కృషి ఫలితంగా ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ముఖ్యమైన ప్రాంతాల్లో మూడు సమగ్ర క్యాన్సర్‌ కేంద్రాలను నిర్మించాలన్న సీఎం జగన్‌ ప్రణాళికను ఆయన వెల్లడించారు. పవిత్ర నగరమైన తిరుపతిలో సూపర్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కూడా నిర్మిస్తామని డాక్టర్ దత్తాత్రేయ నోరి వెల్లడించారు. 
 
ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ, డాక్టర్ దత్తాత్రేయ నోరి ప్రతిదీ స్పష్టంగా చెప్పారన్నారు. 'టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి ఉదాత్త సేవలను విస్తరించేందుకు టాటా గ్రూప్‌ ముందుకు రావడం సంతోషకరం, గర్వకారణం' అని సీఎం జగన్‌ అన్నారు.
 
'ఇది ఇప్పటికే అన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు ఉచిత చికిత్స బ్రాకెట్‌లోకి తీసుకురాబడింది' అని ముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతి పట్టణంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆస్పత్రిని ప్రారంభించడం చాలా సంతోషమన్నారు. అలాగే, ఆరోగ్య పరిశ్రమలో తమ విస్తృతిని పెంచాలని టాటా గ్రూప్‌ని మరియు డాక్టర్ దత్తాత్రేయ నోరిని ఆయన కోరారు.