శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (12:09 IST)

తిరుపతి పర్యటనలో సీఎం జగన్: టాటా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం

ys jagan
ఏపీ సీఎం జగన్ ఈ నెల 5న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. 
 
రూ. 240 కోట్ల వ్యయంతో అలిపిరి వద్ద నిర్మించనున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 
 
అనంతరం టాటా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఇక టాటా క్యాన్సర్ ఆస్పత్రిలో అత్యాధునిక ఉపకరణాలు క్యాన్సర్ పేషెంట్ల చికిత్స కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 
 
ఇకపోతే, పర్యటనలో భాగంగా తిరుపతిలో నిర్వహించే జగనన్న విద్యాకానుక బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.
 
మరోవైపు భారీ వర్షాల కారణంగా తిరుమల పైకి వెళ్లే నడకమార్గం శ్రీవారి మెట్టు ధ్వంసమైన సంగతి తెలిసిందే. దీని పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 
 
శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని కూడా జగన్ ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.