గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (13:44 IST)

ఎంపీ విజయసాయి రెడ్డికి ప్రమోషన్.. బాస్‌లం కాదని జగన్ హితవు

Vijaysaireddy
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ప్రమోషన్‌ ఇచ్చారు. ఈ క్రమంలో  ప్రభుత్వంలో అదనపు సేవలను అప్పగించారు. ఈ క్రమంలో పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలతో పాటు అదనంగా మరిన్ని బాధ్యతలు అప్పగించడం జరిగింది. 
 
గతంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి బాధ్యతలు చూశారు. అయితే.. ఇటీవల కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఆ బాధ్యతల నుంచి విజయసాయి రెడ్డిని తప్పించారు. విశాఖ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు.
 
మనం బాస్‌లం కాదు.. ప్రజా సేవకులమనే విషయాన్ని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు సీఎం జగన్. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించేందుకే 26 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు.