బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (18:08 IST)

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఆగిపోయింది

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు షాక్. గతంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉండేది. కానీ ఆండ్రాయిడ్‌లో వచ్చిన అప్‌డేట్స్‌తో కాల్ రికార్డింగ్ సదుపాయం నిలిచిపోయింది. అయితే త్వరలో ఈ అవకాశం కూడా ఉండదు. 
 
మే 11 నుంచి కాల్ రికార్డింగ్ సాధ్యం కాదు. మొబైల్ యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా కాల్ రికార్డింగ్ చేయలేరు. స్మార్ట్‌ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఉండదు. మే 11 నుంచి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా కాల్ రికార్డింగ్ చేయడం సాధ్యం కాదు.
 
అయితే ఈ విషయాన్ని గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ డెవలపర్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ మార్పులు మే 11 నుంచి అమలులోకి రానున్నాయి.