గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (19:12 IST)

గూగుల్ పే నుంచి రుణం.. రూ.లక్ష వరకు ఇన్‌స్టంట్‌గా పొందవచ్చు..

గూగుల్ పే నుంచి రుణం పొందవచ్చుననే విషయం తెలుసా.. తెలియనట్లైతే ఈ కథనం చదవండి. వెంటనే రూ. 1 లక్ష వరకు రుణం పొందే కొత్త పద్ధతిని గూగుల్ పే తీసుకొచ్చింది. ఇందుకోసం గూగుల్ పే డీఎంఐ ఫైనాన్స్ లిమిటెడ్‌తో జతకట్టింది. 
 
ఈ భాగస్వామ్యంతో రెండు కంపెనీలు కలిసి డిజిటల్ పర్సనల్ లోన్‌ను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఈ డబ్బును ఎలా తిరిగి చెల్లించాలంటే.. గూగుల్ పే ద్వారా డిజిటల్‌ రూపంలో రూ. 1 లక్ష వరకు వ్యక్తిగత రుణాన్ని తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని 36 నెలలు లేదా గరిష్టంగా 3 సంవత్సరాల వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. 
 
ప్రస్తుతం డీఎంఐ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గూగుల్ పే దేశంలోని 15,000 పిన్ కోడ్‌లలో ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ పే కస్టమర్ అయితేనే ఈ రుణం పొందవచ్చు. క్రెడిట్ హిస్టరీ బాగుండాలి. అప్పుడు మాత్రమే ఈ లోన్ అందుకోవచ్చు.