ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (12:45 IST)

సైకిలెక్కనున్న సబ్బం హరి... చంద్రబాబుతో రహస్య మంతనాలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి త్వరలోనే సైకిలెక్కనున్నారు. ఇందుకోసం ఆయన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి త్వరలోనే సైకిలెక్కనున్నారు. ఇందుకోసం ఆయన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.
 
ఆయన తన అనుచరులతో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సబ్బం హరిని తొలుత అభిమానులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సబ్బం హరి మాట్లాడుతూ, ప్రజాభిప్రాయం, అనుచరులు, అభిమానుల సూచన మేరకు త్వరలోనే ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని తెలిపారు. 
 
అంతేకాకుండా, క్రమశిక్షణ, అభివృద్ధి, ప్రజోపయోగం లక్ష్యాలుగా తాను రాజకీయ పదవులు నిర్వహించానని, భవిష్యత్తులోనూ అదే ఉద్దేశంతో తన నిర్ణయం ఉంటుందని చెప్పారు. మేయర్‌గా నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశానని, శివాజీపాలెం డంపింగ్‌ యార్డును తరలించి అక్కడ పార్క్‌ అభివృద్ధి ఇందుకు ఓ ఉదాహరణ అని తెలిపారు. 
 
కాగా, రాష్ట్ర విభజన తర్వాత సబ్బం హరి క్రియాశీలక రాజకీయాలకు దూరమైన విషయం తెల్సిందే. కానీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన స్నేహం మెలుగుతున్నారు. నిజానికి ఈయన వైకాపాలో చేరుతారని గతంలో ప్రచారం జోరుగా సాగినప్పటికీ.. ఆయన జగన్ చెంతకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు.