గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (20:35 IST)

నేరాల నియంత్రణకు నిరంతర నిఘా: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో

రాష్ట్రంలో అక్రమ మద్యం, ఇసుక రవాణాను అరికట్టడానికి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఏర్పాటు చేశామ‌ని, డిజిపి గౌతం సవాంగ్ ఆధ్వర్యంలో ఈ‌ బ్యూరో పని చేస్తుంద‌ని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ప్ర‌త్యేక అధికారి సత్తిబాబు తెలిపారు.

మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో వివిధ నేరాల్లో 307 కేసులు నమోదయ్యాయ‌ని తెలిపారు. 538 మంది అరెస్టు కాగా, 44కార్లు, 5 ఆటోలు, 229 బైక్స్  స్వాధీనం చేసుకున్నామ‌ని పేర్కొన్నారు.

"3029 లీటర్ల, 12,259 మద్యం సీసాలను స్వాధీనం. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 9కేసులు నమోదయ్యాయి. 10మంది అరెస్టు, 9టిప్పర్లు, 200టన్నులు ఇసుక స్వాధీనం. వెనుక ఇంజన్ ఉన్న ఆటోలతో మద్యం సీసాలు తెస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క మద్యం బాటిల్ తెచ్చినా కేసులు నమోదు చేస్తాం.

మన రాష్ట్రంలో ఒక్క వ్యక్తి మూడు బాటిళ్లు మాత్రమే కలిగి ఉండాలి. రెడ్‌జోన్లలోకి ఒక్క బాటిల్ తీసుకెళ్లినా చర్యలు. ఇసుక రవాణాకు సంబంధించి ఒకే బిల్లుపై తరచూ ట్రిప్పులు వేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా, పరిమితి కి మించి ఉన్నా కేసులు నమోదు. ప్రతి చోట బోర్డర్‌లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటుతో నిరంతరం తనిఖీ చేస్తున్నాం.

అక్రమ విధానాలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అక్రమ మద్యం, బెల్టు షాపులు, సారా వివరాలు తెలిస్తే.. 100కు సమాచారం ఇవ్వాలి" అని ప్ర‌జ‌ల‌ను కోరారు.