ఏపీలో కరోనా అప్డేట్ : కొత్తగా 97 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 179 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కృష్ణా జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు.
ఏపీలో ఇప్పటివరకు 8,88,275 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 880,046 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 1071 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
వైరస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఇవాళ్టివరకు 7,158 మంది మృత్యువాతపడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33,876 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1,32,76,678 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించారు