శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (10:02 IST)

మదనపల్లెలో 30 పడకలతో కొవిడ్‌ ఆస్పత్రి

చిత్తూరు జిల్లా మదనపల్లె వైద్యశాలలో 30 పడకలతో కొవిడ్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వైద్యశాలల సమన్వయాధికారిణి (డీసీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ సరళమ్మ పేర్కొన్నారు.

30 పడకల కొవిడ్‌ ఆస్పత్రిలో 20 పడకలు వెంటిలేటర్‌ సౌకర్యంతో, మరో పది సాధారణ పడకలు వుంటాయన్నారు. ప్రత్యేక వైద్యసిబ్బందిని నియమించి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులోభాగంగా 50 ఏళ్లు పైబడిన రోగులను తిరుపతి రుయాకు, 60 ఏళ్లు పైబడిన వారిని స్విమ్స్‌కు రెఫర్‌ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించక పోవడంతోనే వ్యాధి చాపకింద నీరుగా వ్యాపిస్తుందని, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే నవాజ్‌బాషా మాట్లాడుతూ   ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంఽధనలు పాటించాలని సూచించారు.