బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (10:51 IST)

కర్నూలు పెద్దాసుపత్రికి రూ.500 కోట్లు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల భవనాలు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. నాడు-నేడు కింద ఈ నిధులను ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ జీవో జారీ చేశారు.

ఏప్రిల్‌లో పనులు ప్రారంభం కానున్నాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలు ఒకే చోట ఉండేలా భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తం రూ.500 కోట్లలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రూ.300 కోట్లు, కర్నూలు మెడికల్‌ కాలేజీకి రూ.200 కోట్లు కేటాయించింది.
 
నాడు-నేడు కింద నంద్యాల, ఆదోని మెడికల్‌ కాలేజీలకు రూ.950 కోట్లు కేటాయిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జీవోను విడుదల చేశారు. నంద్యాలకు రూ.475 కోట్లు, ఆదోనికి రూ.475 కోట్లకు అనుమతులు జారీ చేశారు.