బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (10:08 IST)

పాల వ్యాన్‌, ఆటో ఢీకొని ఐదుగురు కూలీలు మృతి

నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు-ముంబయి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను పాల వ్యాను వేగంగా వచ్చి ఢీకొనడంతో దువ్వూరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మృతిచెందిన వారిని దువ్వూరు ఎస్సీ కాలనీకి చెందిన కె.బాబు (55), టి.రమణయ్య (60), కె.మాలకొండయ్య (50), జి.శీనయ్య (50), ఎం.శీనయ్యగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. కొడవలూరు మండలం రాజుపాలెం చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్తూ 14 మంది ఆటో ఎక్కబోతుండగా వెనకవైపు నుంచి వచ్చిన వ్యాను ఆటోను ఢీకొీంది.

ప్రమాదంలో ఐదుగురు మృతిచెందటంతో పాటు వ్యాను డ్రైవరుతో సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను బుచ్చిరెడ్డిపాలెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డి పాలెం సీఐ సురేష్‌ బాబు, సంగం ఎస్‌ఐ కె.శ్రీకాంత్‌ ప్రమాద స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.