శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:32 IST)

వాహనం నుంచి జారి పడి ఇద్దరు కూలీల మృతి

బొలెరో వాహనం నుంచి జారి పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

విశాఖ నుండి మచిలీపట్నంకు 28 మంది కూలీలు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. బొలెరో వెనక డోర్‌ ఊడిపోవడంతో.. అందులో ఉన్న ఆరుగురు కూలీలు రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

మరో నాలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ ఏర్పడి వాహనదారులకు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.