మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:30 IST)

జల్లికట్టులో జనంపైకి దూసుకొచ్చిన ఎద్దు.. ఇద్దరు మృతి!

పుదుకొట్టై జిల్లా కల్లూరులో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోటీలను చూస్తున్న జనాలపైకి ఎద్దులు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఎద్దు దాడిలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ముగిసినా.. ఎక్కడో ఒక చోట జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కల్లూరు సమీపంలో బుధవారం జల్లికట్టు, రెక్లా రేసులు జరిగాయి.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన యువతతో పాటు ఈ పోటీలను చూసేందుకు జనం భారీగా తరలిచ్చారు. పరుగులు పెడుతున్న ఎద్దులను నిలువరించే క్రమంలో బెదిరిపోయిన ఓ ఎద్దు పోటీలు చూస్తున్న జనంపైకి దూసుకువచ్చింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎద్దుల దాడిలో గాయపడిన వారిని అరంతంగికి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.