గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (10:51 IST)

జింబాబ్వేలో కరోనాతో ముగ్గురు మంత్రులు మృతి

జింబాబ్వేలో కేవలం వారం వ్యవధిలోనే కరోనాతో ముగ్గురు మంత్రులు కన్నుమూశారు. శుక్రవారం ఆ దేశ రవాణా, మౌలికసదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి జోయల్‌ మటీజా కరోనాతో మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

బుధవారం విదేశీ వ్యవహారాల మంత్రి శిబుసిసో మోయో బుధవారం మరణిఇంచగా...జనవరి 15వతేదీన మనికాలాండ్‌ మంత్రి ఎల్లన్‌ గ్వార్డజింబా కోవిడ్‌కు బలయ్యారు. కాగా, మరో మాజీ మంత్రి సైతం కరోనాతో మృతి చెందినట్లు తెలుస్తోంది.

మాజీ విద్యాశాఖ మంత్రి అనియాస్‌ చిగ్వేడర్‌ కోవిడ్‌ సంబంధిత సమస్యలతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

జింబాబ్వే దేశంలో గత 24 గంటల్లో 639 మంది కరోనా బారిన పడ్డారు. జింబాబ్వేలో 30వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ముగ్గురు మంత్రులు కోవిడ్‌తో మృతి చెందడం ఇప్పుడు అక్కడ కలవరం కలిగిస్తోంది.