గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (10:36 IST)

బ్రిటన్‌లో కొత్త కరోనాతో అత్యధిక స్థాయిలో మరణాలు

కొత్త కరోనా వైరస్‌తో అత్యధిక స్థాయిలో మరణాలు సంభవించవచ్చునని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొలుత ఇంగ్లాండ్‌లో బయటపడ్డ ఈ వైరస్‌..అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీంటికీ పాకిన సంగతి తెలిసిందే.

పాత వైరస్‌తో పోల్చుకుంటే కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ వేగంగా వ్యాపించగలదని అధ్యయనాలు చెప్పాయి. దీనిపై శుక్రవారం జరిగిన సమావేశంలో జాన్సన్‌ మాట్లాడుతూ .మరణాలు మరింత ఎక్కువ సంభవించవచ్చునని హెచ్చరించారు. కాగా, దానికి బ్రిటన్‌ చీఫ్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ ఆట్రిక్‌ వాలెన్స్‌ ఉదహరించారు.

దేశంలో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వెయ్యిమందిలో 10 మందిలో పాత వైరస్‌ కారణంగా చనిపోతే...కొత్త కరోనా వైరస్‌ కారణంగా 13 నుండి 14 మంది బలౌతున్నారని తెలిపారు. అంటే గత వైరస్‌ మరణాలతో పోలిస్తే 30 శాతం అదనమని అన్నారు.

అయితే ఈ వైరస్‌తో ఎందుకు ఎక్కువ మరణాలకు సంభవిస్తున్నాయో ఆయన వివరించలేదు. అయితే ఈ కొత్త కరోనా వైరస్‌ కారణంగానే మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయని చెప్పేందుకు సరైన నిర్ధారణ లేదని ప్రజారోగ్య సిబ్బంది పేర్కొనగా...తాజా ప్రాథమిక గణాంకాలు ఆందోళనలు పెంచుతున్నాయి.