మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (14:03 IST)

బ్రిటన్‌ లో కరోనా మరణాల రికార్డు

కొత్త, పాత వైరస్‌లతో బ్రిటన్‌ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. దీంతో దేశంలో మరణాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,610 మంది కరోనాతో మృతి చెందారు.

2020 కరోనా మొదలైన తర్వాత దేశంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. దేశంలో ఇప్పటి వరకు 91,470 మంది ఈ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, కొత్త కేసుల నమోదులో కాస్త ఉపశమనం కలిగింది.

గడిచిన 24 గంటల్లో 33,355 మంది కరోనా బారిన పడ్డారు. గత వారంతో పోల్చుకుంటే 22 శాతం తక్కువ. ఇప్పటి వరకు మొత్తంగా 3.5 మిలియన్ల మంది కోవిడ్‌ బాధితులయ్యారు.

ప్రస్తుతం బ్రిటన్‌లో మూడవ దశ వైరస్‌ కొనసాగుతుందని తెలుస్తుంది. ఇంగ్లాండ్‌లో గడిచిన డిసెంబర్‌లో 12 శాతం మంది కరోనా బారిన పడగా..నవంబర్‌లో 9 శాతం మంది కోవిడ్‌ బాధితులయ్యారని గణాంకాలు చెబుతున్నాయి.