శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (10:55 IST)

4 గంటల్లో 12,584 కొత్త కేసులు..167 మరణాలు

అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. భారత్‌లో మాత్రం రోజూవారీ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..సోమవారం 12,584 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

జూన్ 17న 12,881 వైరస్ కేసులు వెలుగుచూడగా..ఏడు నెలల కాలంలో ఆ స్థాయి తగ్గుదల కనిపించడం ఇదే మొదటిసారి. నిన్నటి వరకు 1,04,79,179 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

మరోవైపు, కరోనా మరణాల సంఖ్యలో క్షీణత ఊరటనిస్తోంది. రెండో రోజు మరణాల సంఖ్య 200కు దిగువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 167 మంది మృత్యుఒడికి చేరుకోగా..మొత్తం మృతుల సంఖ్య 1,51,327గా ఉంది. ఆ రేటు 1.44 శాతానికి తగ్గింది.
 
ఇక, క్రియాశీల రేటు రెండు శాతానికి చేరువవుతోంది. ప్రస్తుతం దేశంలో వైరస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 2,16,558గా ఉంది. నిన్న ఒక్కరోజే 18,385 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

దేశంలో రికవరీల సంఖ్య 1.01 కోట్లుగా ఉండగా..ఆ రేటు 96.49 శాతానికి పెరిగింది. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం..నిన్న దేశవ్యాప్తంగా 8,97,056 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.