బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (10:34 IST)

ఫ్రాన్స్‌లో తొలి కొత్త కరోనా కేసు

ఫ్రాన్స్‌లో కొత్త కరోనా వైరస్‌ తొలి కేసు నమోదైంది. తొలి కేసు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అధికారికంగా వెల్లండించారు.

బాధితుడు డిసెంబర్‌ 19న బ్రిటన్‌ నుంచి తిరిగి వచ్చినట్లు తెలిపారు. డిసెంబర్‌ 21న పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలడంతో నిర్బంధంలో ఉంచామని, శుక్రవారం మరోసారి పరీక్షలు చేయగా అది కొత్త రకం వైరస్‌ అని నిర్ధారణ అయిందని వెల్లడించారు.

దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం బాధితుడు బ్రిటన్‌ నుంచి వచ్చిన నాటి నుంచి ఎవరెవరిని కలిశాడో వారందరినీ గుర్తించే పనిలో పడింది.