శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (10:35 IST)

దేశంలో కరోనా కేసులు 14,545

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనే ఉంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 14,545 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,25,428కి చేరింది. అయితే క్రితం రోజుతో పోల్చుకుంటే రోజూవారీ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది.
 
ఇక, దేశంలో రికవరీ కేసుల సంఖ్య 1.02 కోట్లుగా ఉండగా..క్రియాశీల కేసుల సంఖ్య 1.88లక్షలకు తగ్గింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.78 శాతానికి చేరింది. క్రియాశీల రేటు 1.78 శాతానికి తగ్గింది.

మరోవైపు, నిన్న 163 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మొత్తంగా మృతుల సంఖ్య 1,53,032కి చేరింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం..జనవరి 21న 8,00,242 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.