శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 22 మార్చి 2021 (19:34 IST)

ఉపముఖ్యమంత్రి అంజద్ బాష కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా

కడప: జిల్లాలో ప్రతి ఒక్కరూ కోవిడ్ వేయించుకొని కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్టీ శాఖ మంత్రివర్యులు అంజాద్బాష పిలుపునిచ్చారు. సోమవారం రిమ్స్ హాస్పిటల్ లోని ఓపీ విభాగంలో  ఉపముఖ్యమంత్రి అంజద్ బాష కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాను వేయించుకొని ప్రజల్లో భరోసా నింపారు.
 
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ  గత ఏడాది కోవిడ్ మహామ్మారి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను బలిగొందన్నారు.కరోన కాలంలో ఆర్థిక,ఆరోగ్య పరంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనాను భారతదేశం,రాష్ట్ర  ప్రభుత్వాలు ఎంతో చాకచక్యంగా ఎదుర్కున్నాయన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత వైపు చూసే విధంగా మేకి ఇన్ ఇండియా లో భాగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ను తయారు చేసి ప్రపంచ దేశాలు మన వైపు చూసే విధంగా  భారత్ నిలిచిందన్నారు.
 
60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు. అలాగే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కూడ కోవిడ్ టీకా చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీకా వేయించుకున్న తరువాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు. భారతదేశంలో ఇప్పటికే  కోట్ల మందికి పైగా దేశ వ్యాప్తంగా వేయించుకోవడం జరిగిందన్నారు.  జిల్లా ప్రజలందరూ మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన తప్పనిసరిగా కోవిడ్ టీకా వేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయాలలో కూడా కోవిడ్  టీకా వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియను రేపట్నుంచి ప్రారంభిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా  స్ట్రెయిన్ వైరస్ బాధితుల కేసులు పెరుగుతున్నాయని దేశంలో నిన్న ఒక్క రోజే 43వేల కేసులు, రాష్ట్రవ్యాప్తంగా 380 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు.కోవిడ్  కేసులు పెరగకుండా వ్యాక్సినేషన్  వేయించుకున్న తరువాత కూడా ప్రజలందరూ భౌతిక దూరము, మాస్కులు, మాస్ గ్యాదరింగ్ లాంటి విషయాల్లో వైరస్ పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.అప్పుడే కరోనాను అరికట్టగలమని ఆయన అన్నారు. 
 
అనంతరం రిమ్స్ఆసుపత్రిలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన  పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ సూపర్ డెంట్ డాక్టర్ ప్రసాదరావు, సి ఎస్ ఆర్ ఎమ్ వో డాక్టర్ కొండయ్య, రిమ్స్ వైద్య శాఖ సిబ్బంది, వైఎస్సార్సిపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.