బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (10:37 IST)

కృష్ణాజిల్లాలో 78,322 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్

కృష్ణాజిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 78,322 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించామని జిల్లా కలెక్టర్‌ ఏయండి ఇంతియాజ్ అన్నారు. విజయవాడ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఇంతియాజ్ కోవిడ్ ‌వ్యాక్సిన్ రెండవ విడత డోసు వేయించుకున్నారు.

ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. జిల్లాలో 190 సెషన్స్ నిర్వహించడం ద్వారా 78 వేల 322 మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేసామని తెలిపారు.

జిల్లాలో తొలివిడతగా ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయడం జరిగిందని, రెండవ విడతగా రెవెన్యూ, పంచాయతిరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖల సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంద‌న్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైంద‌ని, ప్రజల్లో అపోహలు ఉంటే విడనాడాలన్నారు. బాలింతలు, గర్భిణి స్త్రీలు, పిల్లలు, అలర్జి ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోకూడదని కలెక్టర్ ఇంతియాజ్ వెల్ల‌డించారు.